బాలయ్య దుమ్ము దుమారం

- Advertisement -

అక్కడా ఇక్కడా ఎక్కడా తగ్గేది లేదంటున్నారు బాలకృష్ణ. వెండితెరంటే నాలుగు ఫైట్లు, ఆరు పంచ్‌ డైలాగ్ లతో బాలయ్య మార్కు ఎలివేషన్‌ కు అన్ని అవకాశాలుంటాయి. కానీ టీవీషోలు, ఓటీటీ కార్యక్రమాల సంగతి అలా ఉండదు. సినిమాల్లో లాగా ఇమేజ్‌ ని నిలబెట్టే హడావుడికి ఇక్కడ పెద్దగా తావుండదు. ఎంత డైరెక్షన్‌ టీమ్‌ ఉన్నా సొంతంగా స్పాంటేనియస్‌ గా షోని రక్తి కట్టించే హీరోలే క్లిక్కవుతారు.

నాగార్జున, చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌, నాని.. ఈ విషయంలో ఇప్పటికే సక్సెసయ్యారు. ఈ లిస్టులో బాలకృష్ణ కూడా చేరారు. ఆసలు బాలకృష్ణ ఓటీటీ కోసం ఓ టాక్‌ షో చేయటమే విశేషమైతే, అది రికార్డులు బద్దలు కొడుతూ సాగటం మరో విశేషం. అన్‌ స్టాపబుల్‌ అంటూ బాలయ్య చేస్తున్న సందడికి రెగ్యులర్‌ ఫ్యాన్సు థ్రిల్లయితే, న్యూట్రల్‌ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. బాలకృష్ణ టాక్‌ ఇంటర్వ్యూ చేసే తీరు అందర్నీ ఆకర్షిస్తోంది.

అనూహ్యమైన పాపులారిటీ దక్కించుకున్న బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ ఇప్పటికే 7 ఎపిసోడ్‌ లు పూర్తయ్యాయి. మరో మూడు ఎపిసోడ్‌ లు పూర్తయితే మొదటి సీజన్‌ పూర్తవుతుందని టాక్‌. అయితే ఐఎండీబీ లేటెస్ట్‌ రేటింగ్స్‌ లో ఈ షో 9.4 రేటింగ్‌ తో దూసుకుపోతోంది. గెస్టులను బాలకృష్ణ సరదాగా ఇంటర్వ్యూ చేసే తీరు..ఆడి, పాడి అలరించి వినోదం పంచే తీరు ఈ షోని సక్సెస్‌ చేసింది.

సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

పెళ్ళికి సిద్దమైన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -