మొన్న నాని, నిన్న వర్మ, నేడు నాగార్జున

- Advertisement -

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పెద్ద హీరోల సినిమా విడుదల సందర్భంగా టికెట్ల రేట్లను పెంచే వెసలుబాటు లేకుండా ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమలోని పెద్ద హీరోలు, నిర్మాతలు బాహాటంగానే తమ అసహనాన్ని తెలుపుతున్నారు.

మొదట పవన్ కల్యాణ్ ఈవిషయంపై రిపబ్లిక్ ఆడియో రిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంపై ఘాటుగా విమర్శించారు. తర్వాత హీరో నాని స్పందించారు. సినిమా టికెట్ రేట్ల పెంపును అడ్డుకోవడంతో పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్లను తగ్గించడమంటే ప్రేక్షకులను అవమానించడమే అని విమర్శించారు.

ఇక రంగంలోకి దిగిన రాం గోపాల్ వర్మ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై మంత్రి పేర్ని నాని సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాజాగా తాను హీరోగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్లపై అక్కినేని నాగార్జున స్పందించారు. టికెట్ రేట్లు తగ్గించినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తన సినిమా అనుకున్న కనెక్షన్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బాలయ్య దుమ్ము దుమారం

సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

పెళ్ళికి సిద్దమైన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -