Monday, May 6, 2024
- Advertisement -

రజినీ షూటింగ్ లో కరోనా కలకలం!

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీలకు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ గా రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. తాజాగా శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు కొంత జరిగింది. ఇప్పుడు మళ్లీ తదుపరి షెడ్యూలు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. తాజా సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం రేగింది.

షూటింగ్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. యూనిట్ లో 8 మంది వర్కర్స్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ సిబ్బంది కంగారు పడ్డారు. సెట్ లో ఒకే సారి 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ సిబ్బందిలో కలవరం రేగింది.

పాజిటివ్ అని తెలియగానే వారంతా ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తమిళ హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ ‘అన్నాత్తే’కు దర్శకత్వం వహిస్తుండటంతో రజినీ అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -