Friday, April 26, 2024
- Advertisement -

ఆమెది త‌ప్పే! మ‌రీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై స్పంద‌న ఏది

- Advertisement -

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌’ (మా) శ్రీరెడ్డిపై సినీ ప‌రిశ్ర‌మ నుంచి బ‌హిష్క‌రించింది. ఆమె అర్ధ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసింది త‌ప్పే అని మూకుమ్మ‌డి నిర్ణ‌యించారు. ఒకే ఆమె ఆ విధంగా నిర‌స‌న చేయ‌డం త‌ప్పు. కానీ ఆమె అంత‌గా నిర‌స‌న తెల‌ప‌డం వెనుక ఎంతోకొంత ఆర్ధ్ర‌త‌, బాధ ఉండే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి త‌ప్ప ఈ విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం స‌రికాదు అని ప‌లువురు పేర్కొంటున్నారు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మే!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తెలుగు హీరోయిన్లు ఎంత మంది ఉన్నారు? అంతా ఇత‌ర రాష్ట్రాల హీరోయిన్లు వెలుగొందుతున్నారు. ఏదో ఒక‌టి స‌మ‌ర్పించుకోవాలి అని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మే! అక్క‌డ‌క్క‌డ ఇలాంటివి జ‌రుగుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనే జాఢ్యం హీరోయిన్ల పాలిట శాపంగా నిలుస్తోంది. మ‌రీ దానిపై చ‌ర్య‌లు తీసుకోరా అని ప‌లువురు నిల‌దీస్తున్నారు.

ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగే విష‌యాలను నిర్భ‌యంగా చెబుతుంటే వాటిని ప‌ట్టించుకోకుండా ఆమె అర్ధ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసింది అని, త‌మ‌ను నిల‌దీయడం త‌ప్పు అని ‘మా’ నిర్ణ‌యించింది. ఆమె ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌ప్పు ప‌ట్టిన ‘మా’ మ‌రీ ఆమె చెప్పిన వాస్త‌వాల‌పై దృష్టి పెట్టారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎప్పుడు ఉత్త‌రాది, ద‌క్షిణాది హీరోయిన్లు తెలుగులో ఏలుతున్నారు. కానీ తెలుగుకు చెందిన‌ హీరోయిన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న‌తో శ్రీరెడ్డి చెప్పింది. మ‌రీ దానిపై చ‌ర్య‌లు తీసుకోరా అని ప్ర‌శ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -