Thursday, May 16, 2024
- Advertisement -

నిత్యా మీనన్ కి తల పొగరా ? ఎంత వరకూ నిజం ?

- Advertisement -

మలయాళం అమ్మాయి నితామీనన్ కి మంచి నటిగా పేరు ఉంది. సౌందర్య తరవాత అంతగా గొప్ప నటిగా పేరు పొందిన ఆమె మంచి క్లాస్ హీరోయిన్ స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ నిత్యా మీనన్ కి చాలా తలపోగారు అనీ , ఆమె కి ఏ స్టోరీ చెప్పిన విసిగించే ప్రశ్నలు అడిగి తన క్యారెక్టర్ వరకూ కాకుండా సినిమా మొత్తం గురించి అడిగి విసిగిస్తుంది అనీ చెబుతూ ఉంటారు.

ఈమె మీద ఈ రకమైన టాక్ తమిళ , తెలుగు సినిమాల్లో బాగానే ఉంది. ఏదైనా ఆఫర్ ఒచ్చినప్పుడు కూడా తనని కలవడానికి ఎవరినీ అనుమతి లేనిదే రానివ్వదనీ చెబుతూ ఉంటారు. ఇలాంటి పుకార్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆమె మీద ఇప్పుడు డైరెక్ట్ గా ఆమెనే ఈ విషయం మీద అడిగేస్తే ఇందులో నిజం ఏంటి అనే దానికి సమాధానం ఇచ్చింది ఆమె. ” నాతో మనిచేసే ముందర అందరూ ఆ రూమర్ లు నమ్మేసి అలా అనుకుంటారు కానీ కొన్నాళ్ళు పనిచేసిన తరవాత, ఒక ప్రాజెక్ట్ లో నన్ను దగ్గర నుంచి చూసిన తరవాత ఎవరూ అలా అనుకోరి అని నా గట్టి నమ్మకం. అది తప్పు అనే విషయం వారు అప్పుడు గానీ అర్ధం చేసుకోరు. ‘ మీ గురించి బయట చాలా విన్నాను అసలు వాటికీ మీ పర్సనల్ ప్రవర్తన కీ సంబంధమే లేదు ‘ అనే వారు బోల్డు మంది ఉన్నారు . నా చుట్తో వచ్చిన రూమర్ లు ఎలాంటివో చెప్పి వాళ్ళే బాధ పడతారు ” అంటూ చెబుతోంది నిత్యా మీనన్. తాను తేలికగా కలిసిపోయే మెంటాలిటీ ఉన్నదాన్ని కాను అనీ అందుకే ఇలాంటి రూమర్స్ రావడం ఎక్కువ అవుతోంది అని అన్నది ఆమె. తనకి రిజర్వ్ద్ గా ఉండడం ఇష్టం అంటోంది నిత్య. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -