Friday, April 19, 2024
- Advertisement -

వాయిదా పడ్డ విక్టరీ వెంకటేష్.. నారప్ప!

- Advertisement -

మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడికోసం అన్ని రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా థియేటర్స్ మూతపడ్డాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం, ఆచార్య సినిమాల విడుదల తేదీలను మార్చుకున్నారు.

ఈ నేపథ్యంలోనే మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘నారప్ప’ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించడంతో విక్టరీ అభిమానులు నిరాశ చెందారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడిన వెంటనే సినిమా విడుదల తేదీను ప్రకటిస్తామని, అలాగే కరోనా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Also read:అచ్చం బేబమ్మ పోలికలతో ఉన్న ఈ అమ్మాయ్ ఎవరో తెలుసా?

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న “నారప్ప” సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. తమిళంలో “అసురన్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ గా వెంకటేష్ నటిస్తున్నాడు. ఎఫ్ 2, వెంకీమామ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్ తన మూడో సినిమా నారప్ప విజయం సాధిస్తుందని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Also read:ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన బండ్లగణేష్.. డేరింగ్ స్టెప్ తో ప్రేక్షకుల ముందుకు అలా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -