Friday, April 26, 2024
- Advertisement -

ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన బండ్లగణేష్.. డేరింగ్ స్టెప్ తో ప్రేక్షకుల ముందుకు అలా!

- Advertisement -

బండ్ల గణేష్ ఈ పేరు వినని వారు ఎవరూ ఉండరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతోమందిని ఆకట్టుకున్న బండ్లగణేష్ తరువాత నిర్మాతగా మారి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు పెద్ద భక్తుడని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తూ వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఎప్పుడు వార్తల్లో ఉండే బండ్లగణేష్ తాజాగా ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్ తిరిగి సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా కెమెరా ముందు కనిపించారు. ఇప్పటివరకు నిర్మాతగా కమెడియన్ గా వ్యవహరించిన బండ్లగణేష్ తాజాగా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం వినబడుతోంది.తాజాగా తమిళంలో విడుదలై పలు వివాదాలను సృష్టిస్తూ మంచి విజయాన్ని అందుకున్న  ‘మండేలా’ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. దీనికిగాను బండ్లగణేష్ రీమేక్ హక్కుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళంలో యోగి బాబు నటించిన ఆ సినిమా తెలుగులో బండ్ల గణేష్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఓ దర్శకుడు చెప్పడంతో బండ్ల గణేష్ ఈ సినిమా ద్వారా హీరో పాత్రలో చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజమెంత ఉందో తెలియాలంటే బండ్లగణేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మెగా అభిమానులకు ఆచార్య విషయంలోనూ నిరాశే..!

నానీ స్పీడ్‏కు ఆ హీరోయిన్ బ్రేక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -