Saturday, April 27, 2024
- Advertisement -

అచ్చం బేబమ్మ పోలికలతో ఉన్న ఈ అమ్మాయ్ ఎవరో తెలుసా?

- Advertisement -

సాధారణంగా ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. అయితే మన ఏడుగురిని చూసి ఉండము. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు టిక్ టాక్, యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి వీడియోలని చూస్తే కొందరు మాత్రం మన సెలబ్రిటీల పోలికలతో ఉన్నట్లు అనిపిస్తుంది.

అచ్చం అలాంటి పోలికలతోనే ఇప్పటికి ఎంతో మంది హీరో హీరోయిన్లను పోలిన వారు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఉప్పెన సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి పోలికలతో మరో నటి ఉన్నారనే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ నటిని చూస్తే వీరిద్దరు సిస్టర్ అని అనుకునే విధంగా ఒకే పోలికలతో ఉంటారు. ఆ నటిని చూస్తే కనుక మీకు కూడా ఈ విధమైనటువంటి డౌట్ రాకుండా మానదు.

బేబమ్మ పోలికలతో ఉన్న ఆ నటి మరెవరో కాదు ఆమె పేరు విద్య విను మోహన్. కొట్టాయంకు చెందిన విద్య 2013-19 వరకూ సన్ టీవీలో ప్రసారమైన ‘వల్లి’ సీరియల్‌లో, 2020 నుంచి ప్రసారమవుతున్న ‘అభియుమ్ నానుమ్’సీరియళ్లలో పలు కీలక పాత్రలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండి విద్యా తన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అచ్చం బేబమ్మలాగే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరింకెందుకు ఆలస్యం బేబమ్మ పోలికలతో ఉన్న ఆ నటి ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

బిగ్ బాస్ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -