సెట్‌లో డ్యాన్స్ మాస్ట‌ర్ మృతి..షాక్‌లో హీరో అజిత్‌

త‌మిళ స్టార్ హీరో అజిత్ తెలుగు డైరెక్ట‌ర్‌ శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘విశ్వాసం సినిమాలో న‌టిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి దశలో ఉంది. పుణెలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నసంద‌ర్భంలో డాన్సర్ ఓ.ఎమ్.శర్వణన్(42) అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.ఆయనకి వాంతులు కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ శర్వణన్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీరుకెళ్లారు.

అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో శర్వణన్ మ‌ర‌ణించారు.శర్వణన్ మరణించారనే వార్త తెలియగానే అజిత్ తీవ్ర ఆందోళన చెందారు. అజిత్ సుమారు మూడు గంటల పాటు ఆసుపత్రిలోనే గడిపారు.శర్వణన్ మృతదేహాన్ని చెన్నైకి పంపడంలో అజిత్ తనవంతు సహాయం అందించారని తెలుస్తుంది.