Thursday, May 2, 2024
- Advertisement -

విమానంలో న‌టికి వేధింపులు …అరెస్ట్‌

- Advertisement -

బాలీవుడ్ దంగల్ న‌టి జైరా వసీం చాలా రోజులు క్రితం విమానంలో ప్రయాణం చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుండి ముంబైకి విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె పక్కన ఉన్న ప్రయాణికుడు వికాస్ సచ్ దేవ్(39) ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతుండడంతో అది భరించలేని జైరా ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని అందరికీ చెబుతూ కన్నీటి పర్యంతమైంది.

తాజాగా అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయంపై స్పందించిన వికాస్.. తాను అలసిపోయి గాఢనిద్రలో ఉన్నానని.. ఏం చేశానో తనకు తెలియదని తెలిపాడు.ఇక వికాస్ త‌రుపు లాయ‌ర్ కూడా నిజంగా విమానంలో అలాంటి పరిస్థితి ఎదురై ఉంటే సదరు నటి అక్కడున్న అలారంను ఎందుకు మోగించలేదని ప్రశ్నిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -