Saturday, April 20, 2024
- Advertisement -

చైతూతో దాస‌రి త‌న‌యుడు ఢీ

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో దాసరి నారాయ‌ణ రావు పాత్ర చెరిగిపోనిది. ఆయ‌న తీసిన సినిమాలు టాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్ట‌య్యాయి. అలాగే వ్య‌క్తిగ‌తంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌న‌సున్న మారాజు అని కీర్తి గ‌డించారు. ఆయ‌న మ‌ర‌ణం నుంచి దాసరి కుటుంబం ఇంకా కోలుకోలేదు. ఆయ‌న మ‌ర‌ణించిన నాటి నుంచి ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు తేరుకోలేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఆయ‌న కుమారుడు దాస‌రి అరుణ్ కుమార్ సినిమాలో క‌నిపించే అవ‌కాశం ఉంది. అత‌డు మళ్లీ సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఒక్క క్షణం సినిమాలో విలన్‌గా కనిపించిన అరుణ్‌కుమార్ మ‌ళ్లీ సినిమాల్లో క‌నిపించ‌లేదు. ఇప్పుడు ఓ సినిమాలో కూడా విలన్ పాత్రతో రానున్నాడ‌ని తెలుస్తోంది.

సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో దర్శకుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ‌చైత‌న్య సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు `శైలజారెడ్డి అల్లుడు` అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో దాసరి అరుణ్‌కుమార్‌కు ఓ పాత్ర ఇచ్చార‌ని స‌మాచారం. చిన్న‌పాటి విలన్ పాత్ర అని తెలుస్తోంది. పెద్ద సినిమానే కావ‌డంతో అరుణ్‌కుమార్ అంగీక‌రించాడ‌ని తెలుస్తోంది. అరుణ్‌కుమార్ ఇంకా ఒకటి, రెండు సినిమాల్లో కూడా న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. ద‌స‌రా స‌మ‌యంలో ఈ సినిమా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -