Saturday, April 20, 2024
- Advertisement -

నా పెళ్లి గురించి చాలా ఎగ్జయిట్ అవుతున్నా

- Advertisement -

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ తమ ప్రేమకు పుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ 14,15న తమ పెళ్లి వేడుక ఉంటుందని వాళ్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటలీలో వాళ్ల పెళ్లి వేడుక ఉంటుందని తెలిసినా.. ఇంకా పెళ్లి వేడుక ఎక్కడ జరుగుతుందనే దానిపై క్లారిటీ లేదు. ఇన్నేళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట చివరకు పెళ్లి పీటలెక్కుతుండటంతో బాలీవుడ్ సినీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి సందర్భంగా దీపికా పదుకొనెను మీడియా పలకరించింది. తన పెళ్లి గురించి అడిగింది. దానికి దీపిక ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నా పెళ్లి గురించి నేను చాలా ఎగ్జయిట్ అవుతున్నా. నా తదుపరి సినిమా కోసం సంతకం చేసేటప్పుడు ఎంత ఎగ్జయిట్ అవుతానో.. పెళ్లికి కూడా అంతే ఎగ్జయిట్ అవుతున్నా.కానీ.. పెళ్లి తర్వాత నా జీవితం మాత్రం ఏం మారదు. ఇప్పుడెలా ఉన్నానో.. పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటాను.. అంటూ తెలిపింది దీపిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -