Wednesday, May 1, 2024
- Advertisement -

మూడో వన్డేలో విండీస్‌ విజయం

- Advertisement -

భారత పర్యటనలో గెలుపునకు మొహం వాచిన వెస్టిండీస్ జట్టు మూడో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దానిని అందుకుంది. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో టీమిండియాకు పరాజయం ఎదురైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు 43 పరుగులతో కోహ్లి సేనను ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది.

శతకం చేజారినా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ షై హోప్‌ (113 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. యువ హెట్‌మైర్‌ (21 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆష్లే నర్స్‌ (22 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ (39 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలో చేయి వేశారు. 284 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (119 బంతుల్లో 107; 10 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో చెలరేగినా… ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (45 బంతుల్లో 35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ రాణించకపోవడంతో భారత్‌ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో శామ్యూల్స్‌ (3/12) మూడు వికెట్లు తీయగా, హోల్డర్, మెకాయ్, నర్స్‌లకు రెండేసి వికెట్లు క్కాయి. నాలుగో వన్డే సోమవారం ముంబైలో జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -