Friday, March 29, 2024
- Advertisement -

ఈ జంట ఆ రోజునే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా?

- Advertisement -

బాలీవుడ్ హాట్ పెయిర్ రణవీర్ సింగ్, దీపిక పదుకొన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగానే వార్త‌లు వ‌స్తున్నాయి.వాటిపై ఎప్పుడు కూడా వీరిద్ద‌రు స్పందించ‌లేదు.తాజాగా ఈ జంట తమ‌ పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. నవంబర్ 14, 15 తారీఖులలో తమ వివాహం జరగబోతుందంటూ ఆదివారం వెల్లడించారు.ఈ ప్రకటనతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇటలీలో లేక్ కోమోలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. అయితే నవంబర్ 15నే వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఓ కారణం ఉందట.

వీరిద్దరూ జంటగా నటించిన మొదటి సినిమా ‘రామ్‌లీలా’ సినిమా 2013లో నవంబర్ 15నే విడుదలైంది. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమని ఒకటి చేసిన ఈ సినిమాని గుర్తుచేసుకుంటూ సినిమా విడుదలైన రోజునే వివాహ తేదీని నిర్ణయించారని తెలుస్తోంది.. దీపిక బెంగుళూరుకి చెందిన అమ్మాయి దీంతో దక్షిణ భారతీయ సంప్రదాయంలో ఒకసారి, రణవీర్ సింధీ కుటుంబంలో పుట్టడంతో సింధి సంప్రదాయంలో వివాహాలు జరపనున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు పెళ్లికి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -