Sunday, May 5, 2024
- Advertisement -

సొంత‌ జిల్లాలో టీడీపీ ఎంపీకీ చేదు అనుభ‌దం… గో బ్యాక్ అంటూ నినిదాలు

- Advertisement -

సొంత జిల్లా శ్రీకాకులంలో ఎంపీకీ ప్ర‌జ‌ల‌నుంచి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లిన రామ్మోహ‌న్ నాయుడికి అక్క‌డి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు.. రామ్మోహన్ నాయుడిని గ్రామంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదంటూ ఓ గ్రామ ప్రజలు ఆయనపై ఎదురుతిరిగారు. దీంతో చేసేదేమిలేక తొక ముడిచి వెనుతిరిగారు.

సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం పనగానిపుట్టుగ గ్రామంలోని తుఫాను బాధితులను పరామర్శింటానికి వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని, నీళ్లు ఇతర అవసరాలను తీర్చిందని చెబుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు.

తమకు ఎలాంటి సహాయం అందలేదని, విద్యుత్‌ సౌకర్యం ఇప్పటివరకు పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట అంచాన వేయటానికి ఏ ఒక్క అధికారి కూడా ఊరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమి లేక అక్క‌డ నుంచి ప‌లాయ‌నం చిత్త‌గించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -