దీపికా పదుకొనె బాడీ గార్డ్ జీతం ఎంతంటే ?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలు వస్తే వారి క్రేజ్ ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాంతో వారిని కలుసుకోవాలని ఫ్యాన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి టైంలో సెలబ్రిటీలకు పర్సనల్ బాడీగార్డ్ ఉండటం చాలా అవసరం. అందుకే ప్రతి సెలబ్రిటీకి పర్సనల్ బాడీగార్డ్ ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ దీపికాకు కూడా ఒక పర్సనల్ బాడీగార్డ్ ఉన్నాడు.

ప్రస్తుతం అతని ఆదాయం గురించి సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో దీపికా పదుకొనే కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ అతి ప్రేమ కారణంగా పలు సందర్బల్లో దీపికా చేదు అనుభవాలను ఎదుర్కొంది. అందుకే ఆమె పర్సనల్ బాడీగార్డ్ ని ఏర్పాటు చేసుకుంది. జమాల్ అనే బాడీగార్డ్ దీపిక వద్ద గత కొన్నేళ్లుగా ఉంటున్నాడు. ఎక్కడికెళ్లినా కూడా అతను ఉండాల్సిందే. ఓం శాంతి ఓం సినిమా నుంచి దీపికా బాడీగార్డ్ లేనిదే బయటకు రావాడం లేదు.

- Advertisement -

పలు సందర్బల్లో ఇతర స్టార్స్ కూడా జమాల్ ని తమకు ఇవ్వమని దీపికను కోరారట. కానీ దీపికా అతడిని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. అయితే అతను దీపికా నుంచి ఏడాదికి ఒకేసారి 80లక్షల రూపాయల సాలరీ అందుకుంటాడట. జమాల్ కి ఈ స్టార్ హీరోయిన్ కొన్నిసార్లు బోనస్ లు కూడా ఇస్తుందట. అంటే అతని ఆదాయం ఏడాదికి ఈజీగా కోటి రూపాయలు దాటుతుందని చెప్పవచ్చు. బాడీగార్డ్ జమాల్ ని దీపికా చాలా ఆప్యాయంగా చూసుకుంటుంది. ఎంత అంటే.. ప్రతి ఏడాది రాఖీ పండగ రోజు అతనికి రాఖీ కడుతుంది. అతన్ని తన సోదరుడిగా గౌరవిస్తుందట. అందుకే జమాల్ చాలా ఏళ్లుగా దీపికా దగ్గరే బాడీగార్డ్ గా ఉంటున్నాడు.

తన లవ్ స్టోరీ చెప్పిన యాంకర్ దీప్తి నల్లమోతు..!

యాంకర్ రవి వాళ్ళ అమ్మగారి బర్త్ డే సెలబ్రేషన్స్..!

కాజల్ చెల్లి నిషా బేబీ షవర్ ఫంక్షన్..!

అత్తగారింట్లోనే ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -