Friday, March 29, 2024
- Advertisement -

బాలయ్య బాబు గురించి మనకు తెలియని నిజాలు..!

- Advertisement -

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ. పౌరాణికం నుండి ఫిక్షన్ దాకా, మాస్ నుండి క్లాస్ దాకా, సోసియో ఫాంటసీ నుండి హిస్టారిక్ ఇలా అన్ని రకాల సినిమాలు, పాత్రలు బాలయ్య చేశారు. బాలయ్య జీవితంలో మీకు తెలియని కొన్ని విషయాలు చూద్దాం.

*1960 జూన్ 10న బసవ తారకం- తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ.. చెన్నైలో పుట్టిన డిగ్రీ హైదరాబాద్ నిజాం కాలేజీలో పూర్తిచేశారు.

  • నటుడిగా బాలయ్య తాతమ్మ కల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటికి బాలయ్య వయసు పద్నాలుగేళ్లు.
  • బాలకృష్ణ కేవలం 22ఏళ్లకే వసుంధరను పెళ్లి చేసుకున్నారు. 1982లో వీరి వివాహం జరుగగా బ్రాహ్మణి, తేజస్విని మరియు మోక్షజ్ఞ వీరి ముగ్గురు సంతానం.
  • బాలకృష్ణ మొదటి సారి సోలో హీరోగా నటించిన చిత్రం ‘సాహసమే జీవితం’. ఈ చిత్రానికి భారతీ- వాసు డుయో దర్శకులుగా పనిచేశారు. 1984లో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.
  • అప్పట్లో స్టార్ డైరెక్టర్ అయిన కోదండరామిరెడ్డి మరియు బాలయ్యలది హిట్ కాంబినేషన్. నారి నారి నడుమ మురారి, బొబ్బిలి సింహం, భలే దొంగ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వీరి కాంబినేషన్ లో వచ్చాయి. వీరి కాంబోలో వచ్చి 13 చిత్రాల్లో అందులో 9 చిత్రాలు హిట్టైయితే.. 4 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు. అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
  • లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అయిన బాలకృష్ణకు సింహం కలిసొచ్చేలా టైటిల్ పెట్టడం ఓ సెంటిమెంట్. ‘సింహం నవ్వింది, ‘బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా వంటి 8 చిత్రాలకు ఆయన టైటిల్ లో సింహ పెట్టుకున్నారు.
  • ఇప్పటి వరకు ఆయన ఏకంగా 12 చిత్రాలలో పోలీస్ గా కనిపించారు.
  • 1987లో బాలకృష్ణ నటించిన 8 చిత్రాలు విడుదలయ్యాయి. బాలయ్య కెరీర్ లో అత్యధిక చిత్రాలు విడుదలైన ఏడాది అదే.
  • బాలకృష్ణ-విజయశాంతిలది సూపర్ హిట్ పెయిర్. దర్శక నిర్మాతలు బాలయ్య అత్యధికంగా విజయశాంతితో 17చిత్రాల్లో కలిసి నటించారు.
  • తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో పాటు శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన బాలయ్య. తండ్రి ఎన్టీఆర్ యాక్ట్ చేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు,దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక, ఛారిత్రక పాత్రలను పోషించారు. ఇది కూడా ఓ అరుదైన రికార్డు అని చెప్పుకోవాలి.
  • ప్రయోగాలకు ముందుండే బాలయ్య 90లలోనే అనేక ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. అలాంటి చిత్రమే ఆదిత్య 369. హాలీవుడ్ స్థాయి వినోదాన్ని ఆ సినిమా ప్రేక్షకులకు పంచింది. దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నారు.
  • బాలకృష్ణ మొత్తంగా మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు. ‘నరసింహానాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలకు నంది అవార్డు గెలుచుకున్నారు.
  • బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా, అది త్వరలోనే జరనున్నట్లు బాలయ్య ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.
  • అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని బాలకృష్ణ మనసులో కోరిక బయటపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కోసం నేనెప్పుడూ సిద్దమే అని చెప్పడం జరిగింది.

హీరో యష్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

జబర్దస్త్ నరేష్ గురించి షాకింగ్ నిజాలు…!

హీరోయిన్ భావన గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

ప్రభాస్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -