Wednesday, April 24, 2024
- Advertisement -

మాజీ ప్రేమికుడి ఇంట్లో దీపికా పదుకోన్‌ ఏం చేస్తుంది..!

- Advertisement -

బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు క్యూట్ పెయిర్‌గా ఉండేవారు దీపికా పదుకోన్‌ – రణ్‌బీర్‌ కపూర్‌లు.వీరిద్ద‌రు ప్రేమించికున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.అయితే మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా దీపికా పదుకోన్‌ – రణ్‌బీర్‌ కపూర్‌లు వీడిపోయారు. దీపికా పదుకోన్ నుంచి విడిపోయిన త‌రువాత రణ్‌బీర్‌ కపూర్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌తో కొంత‌కాలం ప్రేమయాణం సాగించాడు.వీరి ప్రేమ‌కు రణ్‌బీర్‌ కపూర్ కుటుంబం అంగీకరించ‌క‌పోవ‌డంతో అక్క‌డితో వీరి ప్రేమ‌కు బ్రేక్ ప‌డింది. రణ్‌బీర్‌ కపూర్‌తో బ్రేక‌ప్ తరువాత దీపికా ర‌ణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించింది.చాలాకాలంగా వీరు డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి మ‌నం చేస్తునే ఉన్నాం.తాజాగా దీపికా ర‌ణ‌వీర్ సింగ్‌ల పెళ్లి ఈ ఏడాది చివ‌ర్లో ఉంటుంద‌ని తెలుస్తుంది.

దీనిలో భాగంగానే ప్ర‌స్తుత ప్రేమికుడితో క‌లిసి ,మాజీ ప్రేమికుడి ఇంటికి వెళ్లింది దీపికా ప‌డుకోనే. దీపికా పదుకోన్‌ – రణ్‌బీర్‌ కపూర్‌లు వీడిపోయిన త‌రువాత పెద్ద‌గా క‌లుసుకుంది లేదు.ఆ మ‌ధ్య రణ్‌బీర్‌ కపూర్‌పై సంచ‌ల‌న కామెట్స్ చేసింది దీపికా.చాలకాలం త‌రువాత వీరిద్ద‌రు క‌లుసుకోవ‌డం,పైగా దీపికా వెంట ర‌ణ్‌వీర్ సింగ్ కూడా ఉండ‌టంతో ఈ టాపిక్ చాలా హాట్‌గా మారింది.ఇంత‌కి వీరు ఎందుకు క‌లిశారో మాత్రం తెలియడం లేదు. ప్ర‌స్తుతం రణ్‌బీర్‌ కపూర్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో ప్రేమ‌లో ఉన్నాడు.వీరి ప్రేమ‌కు పెద్ద‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. రణ్‌బీర్‌ కపూర్‌కు గ‌త‌కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డ్డాడు.సంజ‌య్ ద‌త్ జీవిత క‌థ‌గా తెర‌కెక్కిన సంజు సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు.అదే స‌మయంలో బాలీవుడ్‌లో బంప‌ర్ హిట్లు కొట్టింది దీపికా.ప‌ద్మావ‌త్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టింది దీపికా ప‌దుకోన్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -