Friday, May 17, 2024
- Advertisement -

ప‌వ‌న్ ఒక వైపే చూడు..రెండో వైపు చూడాల‌నుకోకు.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా బదులిచ్చారు. తనపై చేసిన ఆరోపణలపై ఎన్ని కమిటీలు అయినా వేసుకొని నిరూపించాలని సవాల్‌ చేశారు. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటూ తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్.. నువ్ ఒక రాష్ట్ర పార్టీ అధినేతవు. కానీ, నియోజకవర్గ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావ్. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటున్నావ్. ఆ మాటలు నీకు బాగనిపిస్తే.. రిజిస్టర్ చేసుకో.. సినిమాలకు బావుంటాయి. కానీ, సగటు మనిషినైన నాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు’ అని చింతమనేని అన్నారు.

‘నువ్ నన్ను నాణేనికి ఒక వైపే చూశావ్.. రెండో వైపు కూడా చూడు. అలా చూస్తే తట్టుకోలేవు. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి చూసి మాట్లాడు. నా పొరపాటును ఒక్కడి కూడా చెప్పలేకపోయావ్’ అని చింతమనేని అన్నారు. పవన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా తాను తాట్టుకున్నానని.. అదే నేను వ్యక్తిగత విమర్శల జోలికి వెలితే పవన్ కల్యాణ్ మూడు రోజులు అన్నం తినరన్నారు .

నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు లాంటి వారితో హెలికాఫ్టర్‌లో తిరిగిన స్థాయి నీదని.. ఒక చిన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యేనైన నన్ను గురిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్‌ను చింతమేనేని ప్రశ్నించారు. ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్‌తో నన్ను పోల్చీ నా స్థాయిని పెంచావని.. అందుకు పవన్‌కు ధన్యవాదాలని అన్నారు.

తన నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అందుకే మీడియా ముందుకు వచ్చానని ఆయన తెలిపారు. ‘నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంత మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్నా..’ అని చింతమనేని అన్నారు.

నీకు దమ్ముంటే.. దెందులూరుకు ఏం చేస్తావో చెప్పు. ఇక్కడికి రా.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం’ అని చింతమనేని అన్నారు.పార్లమెంట్‌ లో ఎమ్మెల్యేలు ఉంటారంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 18 ఏళ్ల వాడిని పోటీకి నిలబెడతాను అంటున్నారు. ఆ వయసులో అసెంబ్లీలో పోటీ చేసే​అవకాశం లేదని కూడా పవన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. రాజకీయ జ్ఞానం కోసం పవన్‌ తనతో ట్యూషన్‌ పెట్టించుకోవాలని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -