- Advertisement -
బాలీవుడ్ స్టార్ కపూల్ దీపిక,రణవీర్లు పెళ్లి చేసకున్న సంగతి తెలిసిందే.బుధవారం రాత్రి బెంగళూరులో ఏర్పాటు చేసిన పెళ్లి రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు నూతన దంపతులు, ఇరు కుంటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుక కోసం రణవీర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న బ్లాక్ కలర్ షేర్వానీ ధరించగా.. దీపిక బంగారపు రంగు చీర ధరించి సింపుల్ గా దక్షిణాది స్టైల్ లో రెడీ అయింది.
అయితే వేదిక మీద దీపిక తన చీరతో కాస్తా ఇబ్బంది పడింది.ఇది గమనించిన రణవీర్ వెంటనే తన చీరను సర్దుతు కనిపించారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలు చూసిన వారు రణవీర్ అప్పుడే భార్య చాటు భర్తగా మారాడు అని చర్చించికుంటున్నారు.
