Friday, May 3, 2024
- Advertisement -

రాజీవ్ కనకాల ఇంట విషాదం… తండ్రి దేవదాస్ కనకాల కన్నుమూత

- Advertisement -

టాలీవుడ్ మరో నటుడు, దర్శకున్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. నాటక దర్శకత్వం నుంచి సినిమా దర్శకునిగా ఎదిగారాయన. దేవదాస్‌ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. చ‌లిచీమ‌లు, నాగ‌మ‌ల్లి చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవ‌దాస్ కుమారుడు రాజీవ్ క‌న‌కాల కాగా, కుమార్తె శ్రీల‌క్ష్మీ. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ న‌డిపిన దేవ‌దాస్ క‌న‌కాల ఎంతో మందికి న‌ట‌న నేర్పించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాల సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు.  సిరిసిరి మువ్వా, గ్యాంగ్ లీడర్, గోరంటాకు సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  దాదాపు 14 సినిమాల్లో ఆయన నటుడిగా నటించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -