Thursday, April 25, 2024
- Advertisement -

టీ 20 ల్లో క్రిస్‌గేల్ నెం.1 రికార్డుకు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ….

- Advertisement -

రోహిత్ శర్మ టీ20ల్లో మరో అరుదైన రికార్డ్‌ ను నెలకొల్పనున్నాడు. అంతే కాదు విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టనున్నారు. వెస్టిండీస్‌తో శనివారం నుంచి మూడు టీ20ల సిరీస్‌ మొదలుకానుండగా.. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు కొడితే..? అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు.

105 సిక్సర్లతో గేల్‌ టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. థర్డ్‌ ప్లేస్‌లో ఉన్న రోహిత్‌ ఖాతాలో 102 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో శనివారం నుంచి భారత్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌లు ఫ్లోరిడా వేదికగా జరగనుండగా మూడో టీ 20 విండీస్ లో జరగనుంది. టీ20లో నాలుగు సిక్సర్లు కొడితే గేల్ రికార్డు బద్దలవుతుంది.

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన రోహిత్‌ ఈ రికార్డును సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 94 మ్యాచ్‌ల్లో 86 ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ 2,331 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -