Tuesday, May 21, 2024
- Advertisement -

బీసీసీఐ, కేంద్ర క్రీడాశాఖ మధ్య చిచ్చు రేపిన డోపింగ్ టెస్ట్…

- Advertisement -

డోపింగ్ టెస్ట్ బీసీసీఐ, కేంద్రం మధ్య మాటల యుద్ధం రాజేసింది. డోపింగ్ టెస్ట్ లో యువ క్రికెటర్ పృథ్వీ షా డోప్‌ విఫలమవడంతో అతనిపై 8 నెలలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర క్రీడల శాఖ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డోపింగ్ టెస్ట్ నిర్వహించే అధికారం బీసీసీఐకి లేదని అలాంటప్పుడు… క్రికెటర్లకు బోర్డు ఎలా ‘టెస్ట్‌’లు నిర్వహిస్తోందని ప్రశ్నించింది.

దీనిపై బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీకి కేంద్ర క్రీడల శాఖ లేఖ రాసింది. డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని లేఖలో పేర్కొంది. అంతేకాగు, అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని మరోమారు గుర్తు చేసిన క్రీడాశాఖ… బీసీసీఐకి వాడా గుర్తింపు లేదని పేర్కొంది. అయితే, బీసీసీఐ వాదన మాత్రం మరోలా ఉంది… తమ డోపింగ్‌ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్న పేర్కొంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -