Monday, May 6, 2024
- Advertisement -

అంద‌మైన అమ్మాయి రొమాన్స్‌లో మ‌న్మ‌థుడు

- Advertisement -

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టిస్టారర్‌ దేవదాస్‌. దేవ పాత్రలో డాన్‌గా నాగార్జున, దాసు పాత్రలో డాక్టర్‌గా నాని నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పోస్టర్స్‌, లిరికల్‌ సాంగ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

అయితే తాజాగా ‘దేవదాస్‌’ సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్‌ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందంటూ ట్వీట్‌ చేశాడు నాగ్‌.”చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! యా… రొమాన్స్ ఎగైన్” అని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా పాట లిరికల్ వీడియోను నేటి సాయంత్రం విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇక తెరపై హీరోయిన్లతో రొమాన్స్ ను పండించే నాగ్, ఆకాంక్షతో చేసే రొమాంటిక్ సన్నివేశాల గురించి తెలియాలంటే, ఈ నెల 27 వరకూ వేచి చూడక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -