Sunday, May 19, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’కి యావ‌రేజ్ సాంగ్స్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్‌

- Advertisement -

తెలుగు యంగ్ త‌రంగ్ , మ్యూజిక్ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ మ‌ధ్య కాలంలో స‌రైన మ్యూజిక్ అందిచ‌డంలో ఫెయిల్ అవుతున్నాడు. గ‌త కాలంగా దేవీ మంచి మ్యూజిక్ ఇవ్వ‌డంలో ఫెయిల్ అవుతున్నాడు. గ‌తంలో అందరి హీరోల‌కి త‌న మ్యూజిక్‌తో సూప‌ర్ హిట్లు ఇచ్చిన దేవీ ఇప్పుడు ఆ రేంజ్‌లో ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో రాజ్ త‌రుణ్ వ‌రకు త‌న మ్యూజిక్‌తో హిట్లు ఇచ్చిన ఘ‌న‌త దేవీశ్రీ ప్ర‌సాద్‌కే ద‌క్కుతుంది. అయితే కొద్దిరోజులుగా దేవీ సంగీతంలో కొత్తద‌నం క‌నిపించ‌డం లేద‌ని అంద‌రు చెబుతున్నారు.

ఈ సంవ‌త్స‌రం వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామకు కూడా స‌రైన సంగీతం అందిచ‌డంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు దేవీశ్రీప్ర‌సాద్‌. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న మ‌హ‌ర్షి సినిమాకు కూడా మంచి సంగీతంలో ఇవ్వ‌డంలో ఫెయిల్ అయ్యాడ‌ని అంటున్నారు మ‌హేశ్ బాబు ఫ్యాన్స్‌. గతంలో మ‌హేశ్ బాబు శ్రీమంతుడు, భ‌ర‌త్ అను నేను సినిమాల‌కు సూప‌ర్ మ్యూజిక్ అందించి సినిమా స‌క్సెస్‌లో తాను ఓ భాగం అయ్యాడు. 1 నేనొక్కిడినే సినిమాకు కూడా మంచి సంగీతం అందించాడు. ఈ సినిమా ఫెయిల్ అయిన‌ప్ప‌టికి దేవీ సంగీతం ఆక‌ట్టుకుంది. తాజా మ‌హర్షి సినిమాకు మంచి సంగీతం అందిచ‌డంలో దేవీశ్రీప్ర‌సాద్ ఫెయిల్ అవ్వ‌డంలో మ‌హేశ్ అభిమానులు ఆయ‌న‌పై మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే విడుద‌ల అయిన మ‌హ‌ర్షి సాంగ్స్‌లో అన్నింటిలోనే కేవ‌లం రెండు మాత్ర‌మే ఆక‌ట్టుకున్నాయి. పైగా ఈ సినిమా మ‌హేశ్ కెరీర్‌లో ఈ సినిమా 25వ సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమాకు త‌గ్గ‌ట్లు సంగీతం అందిచ‌డంలో దేవీశ్రీప్ర‌సాద్ మ‌హేశ్ అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. దీంతోసోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని దేవీశ్రీని ట్రోల్ చేస్తున్నారు మ‌హేశ్ అభిమానులు. మరి సినిమాలో వ‌చ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో అయిన దేవీశ్రీ ఆక‌ట్టుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -