Thursday, May 16, 2024
- Advertisement -

జగన్ కు వీళ్లే గుదిబండగా మారుతున్నారా?

- Advertisement -

వైఎస్ జగన్ గద్దెనెక్కగానే అవినీతికి దూరంగా పారదర్శక పాలన కోసం కృషి చేస్తున్నారు. అవినీతి రహిత సమాజం కోసం ఏకంగా జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పనులన్నింటిలో పారదర్శకత పెంచారు. ఇక పైరవీలు, లంచాలకు సచివాలయంలో తావులేకుండా చేశారు. మంత్రులకు గట్టి హెచ్చరికలు పంపి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు..

జగన్ ఇంత నీతి నిజాయితీలతో వెళ్తుంటే కొంతమంది వైసీపీ నాయకుల వ్యవహారశైలి మాత్రం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన క్రెడిట్ ను గంగపాలు చేస్తోంది. జగన్ పరువు తీసేలా కొంత నేతలు లంచాలు, అవినీతికి పాల్పడుతూ ఆరోపణలు తెచ్చుకుంటూ ప్రతిష్టను మసకబారుస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా తన బర్త్ డే కోసం కోటి రూపాయలు వసూలు చేసిన వైనం వైసీపీలో చర్చనీయాంశమైంది. ఇక కృష్ణా జిల్లాలో ఇసుక మైనింగ్ లో ఇద్దరు ప్రజాప్రతినిధులు వాడుకున్న ప్రచారం వైసీపీకి చెడ్డపేరు తెస్తోంది. ఇక పదేళ్లు అధికారానికి దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు, మంత్రుల్లో కొందరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ప్రచారం వైసీపీ క్రెడిట్ ను దెబ్బతీస్తోంది. జగన్ ఎంత అవినీతి రహిత, పారదర్శకత పాలన కోసం పాటుపడుతున్నా క్షేత్రస్థాయిలోని నేతలు మాత్రం జగన్ బాటలో నడవకపోవడం.. వైసీపీ పరువు తీసేలా వ్యవహరించడం పార్టీకి పెద్ద మైనస్ గా మారిందంటున్నారు.

నడిపించే నాయకుడు స్వచ్ఛంగా ఉండి.. నేతలు కూపంలో దిగితే ఎంత చేసినా ఈ మురికి అంటి చెడ్డపేరే వస్తుంది. మిగతా వారంతా ఆ నాయకుడి బాటలో నడిస్తేనే కదా.. ఆ జట్టు విజయం సాధిస్తుంది.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కు అలాంటి పరిస్థితే ఎదురవుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -