Saturday, May 18, 2024
- Advertisement -

ధనుష్ తో హాలీవుడ్ హీరోయిన్.. అది ఒక బూతు సినిమా!

- Advertisement -

ఇప్పటికే రజనీకాంత్ అల్లుడు ధనుష్ బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. అక్కడ ‘రంజానా’ మూవీతో తన మార్కు ను వేశాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ వెలుగొందుతున్న ఈ బక్క పల్చటి హీరో ఇప్పుడు ఒక సంచలన సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా పక్కా బూతు సినిమా అనే ఇండికేషన్ ను ముందుగానే ఇవ్వడం.. అందులో హాలీవుడ్ నటీమణి కిమ్ కర్దాషియన్ నటిస్తుండటం బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయాలు.

త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఈసినిమాను  హిందీ, తమిళ భాషల్లో రూపొందించనున్నారని తెలుస్తోంది. దీని కోసం కర్దాషియన్ చేత ఓకే చేయించుకొన్నారట. ఆమెకు భారీ పారితోషకాన్ని ఆఫర్ చేసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం.

ఇప్పటికే కిమ్ భారతీయులకు కొంత పరిచయమే. ఇంగ్లిష్ సినిమాలను ఫాలో అయ్యే ఇండియన్స్ కు కిమ్ ఫోజులూ గట్రా బాగా తెలుసు. మరి అలాంటి నటీమణిని ధనుష్ పక్కన చూపించబోతున్నారనే విషయం వీరిలో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అది కూడా పక్కా బూతు సినిమా అని దాని పేరే “అడాల్ట్స్ ఓన్లీ” అని చెబుతుండటం సహజంగానే దీనిపై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -