Saturday, May 18, 2024
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంతిపై ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు- అరెస్ట్ చేసిన పోలీసులు

- Advertisement -

మనం రోజు ఫేస్‌బుక్‌‍లో ఎన్నో పోస్ట్‌లు చేస్తుంటాం, చూస్తుంటాం.  కాని కొంత మంది అసభ్యకరంగా వ్యాఖ్యలు పోస్ట్ చేసి వివాదం చేస్తుంటారు. ఇలా పోస్ట్‌ చేయడం వలన కొంత మంది అరెస్ట్ అవ్వడం, కొంత మందికి ఆ పోస్ట్‌లు బాధ కలిగించడం జరుగుతూ ఉంటుంది.

అలాగే తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ బొజ్జ రవికాంత్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఒక టిఆర్‌ఎస్‌ స్థానిక నేత కత్తుల రమేశ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలపై కేసు నిలుస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. ముంబైలో ఇలాంటి కేసు న్యాయస్థానం ముందు నిలవకపోగా పోలీసులను తప్పు పట్టింది. మరి ఈ కేసులో కోర్టు ఏం చెబుతుందో చూడాలి.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -