Wednesday, April 24, 2024
- Advertisement -

అనుష్కను అమితాబ్ ఆ విషయాల గురించి అడిగాడా..?!

- Advertisement -

ఈ మధ్య అనుష్క శర్మ చాలా చిరాకుతో ఉంది. ఈ చిరాకును ట్విటర్ ద్వారానే ఆమె ప్రదర్శిస్తోంది. ఇక్కడ చిరాకుకలుగుతున్నది ట్విటర్ వల్లనే కావడంతో అనుష్క ఆ చిరాకును ట్విటర్ ద్వారానే వ్యక్తం చేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ట్విటర్ అనుష్కను ఆమె ఫాలోయర్లు తెగ విసిగిస్తున్నారట. విరాట్ వ్యవహారం ఎంత వరకూ వచ్చింది? మీ పెళ్లి ఎప్పుడు? వంటిప్రశ్నలతో పాటు మీ మధ్య బ్రేకప్ అయ్యే అవకాశాలున్నాయా? అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారట!

దీంతో విసిగిపోయిన అనుష్క ఈ విషయంలో అసహనాన్ని ప్రదర్శించింది. అలాంటిప్రశ్నలు అడిగే వారిని తను బ్లాక్ చేసేస్తాను అని ఆమె హెచ్చరించింది! ఈ మేరకు ఒక ట్వీట్ పెట్టింది. మర్యాదగా నడుచుకోవాలని.. లేకపోతే బ్లాక్ చేస్తా జాగ్రత్త అని అనుష్క ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులు డంగైపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రం అనుష్కకు ఒక హెచ్చరికనే జారీచేశాడు!

ట్విటర్ లో తనను బ్లాక్ చేస్తే ఊరుకోను..అని అనుష్కతో ఆయన అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్. అయితే సరదాగా హెచ్చరిక చేశాడు. ఆయన కోపంలో ఉన్న అనుష్కను తన సరదాతో ఊరడించే యత్నం చేశాడు. దీంతో అనుష్క చల్లబడింది. “అయ్యో..సార్ మిమ్మల్ని బ్లాక్ చేయడమా… అది జరగని పని.. ” అనేలా సమాధానం చెప్పింది అనుష్క. మరి అనుష్క ఇలా చెప్పింది కాబట్టి.. అమితాబ్ ఆమె పెళ్లి గురించి ఆరాలు తీయడానికి అవకాశం దొరికినట్టేనా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -