Saturday, May 11, 2024
- Advertisement -

సౌత్ హీరో చెంప పగలగొట్టా

- Advertisement -

బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే గురించి ఇప్పుడు మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకొవాడానికి ఏం లేదు. ఏదీ అయిన స‌రే ముక్కు సూటిగా చెప్పేస్తుంది.దానివ‌ల్ల వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది రాధికా ఆప్టే.అస‌లు కాస్ట్ కౌచింగ్ అనే ప‌దం ఈమె వ‌ల్లే ప్రాచుర్యంలోకి వ‌చ్చింది.ఇప్పుడు తాజాగా మ‌రో బాంబు పేల్చింది. ఈసారి ద‌క్షిణాదిపై కామెంట్స్ చేసింది.బాలీవుడ్‌ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్‌ షో వోగ్ బీఎఫ్‌ఎఫ్‌కు రాధిక అతిథిగా వెళ్లింది.

తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా సెట్‌కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. ఇంత‌కి ఆ హీరో ఎవరు అనే కదా! మీ డౌట్‌…..ఆయ‌న పేరు మాత్రం చెప్ప‌లేదు రాధికా ఆప్టే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -