Friday, March 29, 2024
- Advertisement -

బాలీవుడ్ లో దిల్ రాజు రెండో సినిమా

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో కన్సిస్టెంట్ గా సినిమాలు నిర్మిస్తూ, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తూ లాభాల బాట పడుతున్న నిర్మాతలు చాలా తక్కువ. అలంటి వారిలో దిల్ రాజు ముందుంటారు. దిల్ రాజు తన కెరీర్ లో ఇప్పటికి ఎన్నో సినిమాలు నిర్మించారు. అందులో చాలా సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే ఇటీవలే ఆయన తీసిన మహర్షి సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ ఏడాది లో దిల్ రాజు కి చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే ఈ ఏడాది ప్రథమార్థం లో ఆయన చేసిన సినిమా F2 కూడా పెద్ద విజయం సాధించింది. అయితే ఈ సినిమా ని ఆయన హిందీ లో నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ తో పాటు ఈ సినిమా ని దిల్ రాజు హిందీ లో నిర్మింస్తున్నట్లు ప్రకటన కూడా చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో దిల్ రాజు కి మొదటిది.

ఇప్పుడు దిల్ రాజు రెండో సినిమా ని కూడా లైన్ లో పెట్టారట. దీని కోసం ఆయన కరణ్ జోహార్ తో చేతులు కలపనున్నారు. ఇటీవలే కరణ్ నాని నటించిన జెర్సీ సినిమా రైట్స్ కొన్నారు. ఈ సినిమా ని దిల్ రాజు తో కలిసి హిందీ లో నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -