Friday, May 3, 2024
- Advertisement -

బీప్స్, కట్స్ తో నిండనున్న కాజల్ సినిమా?

- Advertisement -

బాలీవుడ్ లో క్వీన్ అనే సినిమా పెద్ద హిట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. హిందీ లో కంగనా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించగా, ఈ సినిమా ని దక్షిణాదిన అన్ని భాషల్లో రీమేక్ ప్రకటించారు. సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. తెలుగు లో ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటించగా తమిళం లో కాజల్ అగర్వాల్, మలయాళం లో మంజిమ మోహన్ మరియు కన్నడ లో పరుల్ యాదవ్ నటించారు. అయితే ఈ సినిమా కి తెలుగు లో తప్ప మిగిలిన అన్ని భాషల్లో సెన్సార్ పూర్తయింది. కన్నడ, మలయాళం లో ఈ సినిమా కి U/A ఇచ్చారు కానీ తమిళం లో సినిమా వివాదాస్పదమైంది.

పారిస్ పారిస్ అనే టైటిల్ తో కాజల్ హీరోయిన్ గా తమిళం లో విడుదల కానున్న ఈ సినిమా ని చూసిన సెన్సార్ బోర్డు దాదాపు గా 35 కట్స్, ఇంకా చాలా డయలాగ్స్ మ్యూట్ చేయమని ఆదేశించిందట. ఈ విషయమై ఇప్పుడు చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీ కి అప్పీల్ చేయనుందట. వేరే భాషల్లో అభ్యంతరాలు చెప్పని సెన్సార్ బోర్డు తమిళం లో నే ఎందుకు ఇలా చేస్తుంది అనేది వారి ప్రశ్న.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -