Friday, May 10, 2024
- Advertisement -

మహేష్ పుణ్యమా అని డబ్బు సంపాదిస్తున్న దర్శకుడు

- Advertisement -

హిట్ ఉంటె చాలు, సినిమా పరిశ్రమ లో అన్నీ వాటంతట అవే మన కాళ్ళ దగ్గరకి వస్తాయి. ప్రస్తుతం అదే విషయాన్నీ అనుభవిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి విడుదల అయిన F2 చిత్రం ఎంత విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ విజయం దర్శకుడు అనిల్ కి మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం కూడా తీసుకొని వచ్చింది. దాని పుణ్యమా అని స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోయాడు అనిల్. అయితే తన మొదటి చిత్రం పటాస్ మినహాయిస్తే, మిగిలిన మూడు చిత్రాలు దిల్ రాజు బానర్ లో చేసాడు అనిల్.

ఈ మూడు సినిమాలకి కలిపి పది కోట్లు రెమ్యూనరేషన్ అందుకోలేదు అనిల్. కానీ ఇప్పుడు అనిల్ ఈ మహేష్ బాబు చిత్రం ఒక్క దానికే పది కోట్లు తీసుకుంటున్నాడట. ఒక్క సినిమా తో నే ఇంత పెద్ద జాక్పాట్ కొడతాడు అని అనిల్ అస్సలు ఊహించి ఉండడు. దిల్ రాజు తో పాటు ఈ సినిమా ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి మహేష్ అక్షరాలా యాభై కోట్లు పారితోషికం గా అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జులై లో మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -