Saturday, April 20, 2024
- Advertisement -

భార్య‌తో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్ట‌ర్

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు పరంపర కొనసాగుతూనే ఉంది.అక్టోబర్ 2న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించగా, ఈ ఏడాది ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కూడా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా మ‌రో సెల‌బ్రిటీ క‌పూల్ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా అతని భార్య ముత్తుమలర్ మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు.

పరస్పర అంగీకారంతో బాలా, మలార్ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చెన్నైలోని కుటుంబ న్యాయస్థానం వారికి గత వారం విడాకులు మంజూరు చేసింది. నిజానికి డైరెక్టర్ బాలకి ముత్తు మలర్ తో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప ఉంది. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా నాలుగు సంవత్సరాల నుండి విడిగా ఉంటున్నారు.

తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరి విడాకుల వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ షాక్‌‌కి గురి చేసింది. వీరికి ప్రార్థన అనే పాప ఉంది. దర్శకుడు బాలా చివరిగా ధృవ్ విక్రమ్ తో వర్మ అనే సినిమాని చేశాడు. ప్రస్తుతం హీరో సూర్యతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -