హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న ఆలియా భ‌ట్

- Advertisement -

బాలీవుడ్ తార‌లు చాలా మంది హాలీవుడ్ లో స‌త్తా చాటుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, దివంగత ఇర్ఫాన్ ఖాన్, అలీ ఫజల్ వంటి స్టార్స్ హాలీవుడ్ చిత్రాల్లో మెరిశారు. ఇప్పుడు వీరి బాట‌లో వెళ్లేందుకు ఆలియా భ‌ట్ సిద్ధ‌మైపోంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో గాల్ గాడోట్, జామీ డోర్నన్ వంటి స్టార్ నటులతో కలిసి తెరను పంచుకోనుంది.

అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నారు. దీనిని నెట్‌ఫ్లిక్స్ , స్కైడాన్స్ తీసుకురానున్నాయి. ఆలియా ఫోటోను నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ… “ఆలియా భట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’లో ఉండబోతోందని ప్రకటించడం ద్వారా మా రోజును ప్రారంభించాం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

- Advertisement -

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. ఆలీయా భ‌ట్ న‌టించిన గంగూబాయ్ క‌తియావాడి చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆలియా నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది ఆలియా.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -