Saturday, May 4, 2024
- Advertisement -

మీడియం రేంజ్ హీరో తో సినిమా చేయాలనుకుంటున్న స్టార్ దర్శకుడు

- Advertisement -

ఈ ఏడాది మొదట్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’ తో డిజాస్టర్ ను అందుకున్న నందమూరి బాలకృష్ణ సినిమా ఏంటి అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు బాలయ్య బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఆ సినిమా ఇంకా పట్టా లెక్క కుండానే బోయపాటి శ్రీను సైడ్ అయిపోయి ‘జై సింహా’ ఫేమ్ కె.ఎస్.రవికుమార్ పేరు బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా మరోవైపు బోయపాటి శ్రీనివాస్ పరిస్థితి మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. కార్తికేయ కు వినిపించిన కథ కూడా నచ్చింది కానీ ఇప్పటికే ఆ హీరో నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు. కాబట్టి బోయపాటి తో సినిమా అంటే కొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే బెల్లంకొండ ని పక్కన పెడితే ఇప్పటిదాకా బోయపాటి శ్రీను కేవలం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం చూసిన స్టార్ హీరోలు బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారు అని, అందుకే బోయపాటి మీడియం రేంజ్ హీరోలవైపు చూస్తున్నాడని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -