Sunday, April 28, 2024
- Advertisement -

సుకుమార్ కొత్త సినిమా ‘డైరెక్టర్’ ?

- Advertisement -

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ తను చేస్తున్న సినిమాలు తీస్తూనే సడెన్ గా నిర్మాతగా మారడం తను రాసుకున్న ఓ కథనే కుమారి 21f సినిమా తీయడం జరిగింది. సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది అది అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం సుకుమార్ మరో కథ రెడీ చేశాడట. అదేనండి సుక్కు నిర్మాణంలో తను రాసిన మరో కథ సినిమాగా రాబోతుందట.

అదేంటి మొన్ననేగా కుమారి వచ్చింది అప్పుడే ఇంకో కథ.. అయినా సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా షూటిలో ఉన్నాడు కదా.. మరి ఇంతలోనే ఇది ఎలా సాధ్యం అంటే సుక్కు దగ్గర ఇలాంటి కథలు చాలా ఉన్నాయట.మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ కాబట్టి మరో సినిమా కూడా అదే రేంజ్లో తీసేందుకు రంగం సిద్ధ చేస్తున్నాడట.

అయితే ఈసారి రాసుకున్న కథకి ‘డైరక్టర్’ అనే టైటిల్ పెట్టినట్టు సమాచారం. మరి ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నదాని మీద ఇంకా ఓ క్లారిటీ రాలేదు కాని సుకుమార్ రైటింగ్స్ నుండి మరో కథ వస్తుందని మాత్రం కన్ఫాం అయ్యింది.సుకుమార్ తన డైరెక్ట్ చేసే సినిమాలనైతే లేట్ చేస్తాడు కాని తను రాసే కథలను మాత్రం త్వరగానే తెరకెక్కిస్తున్నాడని అందరు అనుకుంటున్నారు.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నాన్నకు ప్రేమతో సినిమా డైరెక్ట్ చేస్తున్న సుకుమార్ ఆ సినిమాను కూడా అంచనాలను అందుకునేలానే తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -