ఎప్పుడొచ్చామననది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? అన్నదే పాయింట్. ఇదే ఇప్పుడు టీడీపీలో లోకేష్ మార్కు రాజకీయం. అనుభవం ఎందుకు.. రాజకీయాలు తెలియాలా! అవన్నీ ఎన్నికలపుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నా మాటే శాసనం. నేను చెప్పిందే వేదం అంటూ తెగేసి చెబుతున్నాడట లోకేష్‌బాబు! జాతీయ స్థాయిలో లేని పార్టీకి ఆయన కార్యదర్శి హోదా! పైగా ఐటీలో మాంచి పట్టు.
ప్రజల్లో బోలెడంత ఇమేజ్ దాదాపూ.. జూనియర్ ఎన్టీఆర్ ప్లేసును భర్తీ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు మా లోకేష్ అంటూ.. కొందరు భజనబృందం మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారట. ఎక్కడకెళ్లినా సీఎం తనయుడిగా రాచమర్యాదలు, వినతులు, విన్నపాలు, రాజీలు, పంచాయతీలు అవన్నీ షరా మామూలే. మొన్నా మధ్య చిత్తూరు జిల్లాలో గల్లా అరుణ, గల్లా జయదేవ్‌లు మేం చెప్పిన పనులు కావట్లేదంటూ ఆవేదనంతా సీఎం చంద్రబాబు ముందు వెళ్లబోసుకున్నారట.
ఇక కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి టీడీపీ రావటాన్ని అడ్డకుంటున్న నేతలలకు చినబాబు మాంచి క్లాసే పీకేడాట.ఇక నెల్లూరు విషయానికొస్తే ఎప్పుడు పడితే అప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై దుమ్మెత్తిపోసే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరిస్థితి గడ్డుగా మారిందట. ఆనం సోదరులు సైకిల్ ఎక్కగానే.. తనను పక్కకు నెట్టారనే బాధనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక్కడా చినబాబే చక్రం తిప్పాడట. ఇప్పుడు.. విశాఖ రాజకీయాల్లో ఏకంగా చినబాబు డైరెక్ట్ గా ఎంటరయ్యాడు. అయ్యన్న పాత్రుడు తరపున వకాల్తా పుచ్చుకుని.. కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి పచ్చకండువాలకు అడ్డుపడుతున్న మంత్రి ఘంటా శ్రీనివాసరావుకు ఏకంగా క్లాసే పీకేడాట లోకేష్.
నేను.. మా నాన్నలా కాదు.. మీ పరిధిలో మీరుంటే మంచిదంటూ గంటాకు గుండెలదిరేలా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు వాల్తేరంతా కోడై కూస్తోంది. దీంతో సైలెంట్ అయిన గంటా.. పార్టీ సమావేశాలకు ఇక వెళ్లకూడదని నియమం పెట్టకున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఈ లెక్కన చినబాబు.. ఇలా రెచ్చిపోతూ పోతే! ఏం జరగొచ్చనేది పాపం ఆ పార్టీనే నమ్ముకున్న సీనియర్ల ఆవేదన.
