- Advertisement -

బాబాయ్ – అబ్బాయ్ ఇద్దరూ తగ్గట్లేదు . సై అంటే సై అంటున్నారు !

- Advertisement -

ఈ మధ్య ఓ వార్తా నందమూరి అభిమానులను తెగ సంతోషపెట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నటసింహ బాలకృష్ణలు ఇద్దరు ఒకటయ్యారని, త్వరలో నాన్నకుప్రేమతో ఆడియోకి బాలయ్య స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారని, బాలయ్య కోసం ఎన్టీఆర్ తన సినిమాను వాయిదా వేసుకోవడం జరుగుతుందని అంతటా వినిపించాయి.

దాంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.కాని వాస్తవానికి వస్తే ఇప్పటివరకు అధికారికంగా బాలయ్య తో ఎన్టీఆర్ ఎలాంటి మీటింగ్ కాని ఫోన్ లో మాట్లాడుకోవడం కాని జరగలేదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా దేవి శ్రీ ఇచ్చిన కోఆపరేషణ్ పుణ్యానా సినిమా ఆడియోని ఈ నెల 27 న విడుదల చేయడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.అలాగే సినిమాను కూడా ఎట్టిపరిస్థితులలో సంక్రాంతికే విడుదల చేయాలని అందులో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు. ఈ విషయాని నాన్నకుప్రేమతో టీం ట్విట్టర్ లోను దృవీకరించింది.

ఇదే విషయాన్ని అధికారికంగా సినిమా ఆడియో ఈవెంట్ లో తెలియజేయనున్నట్లు తెలిపారు. దాంతో బాబాయ్-అబ్బాయ్ ల సంక్రాంతి పోరు కచ్చితంగా జరగబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -