Friday, May 3, 2024
- Advertisement -

చిరంజీవి ని చూసి నవ్వుతారు ..

- Advertisement -

చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఆయనకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ఎక్కడ చూసినా సంచలనంగా మారాయి.

చిరంజీవి మీద తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు డైరెక్టర్ కోదండరామి రెడ్డి. చిరంజీవి తో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ గా ప్రఖ్యాతికి ఎక్కిన రామిరెడ్డి ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి గణన యాక్షన్ సినిమాలు చేస్తూ సందేశాత్మక సినిమాలు చెయ్యడానికి ప్లాన్ చేస్తే అది జనాలకి నవ్వు వొచ్చే విధంగా ఉంటుంది తప్ప ఉపయోగం ఉండదు అంటున్నారు ఆయన .

” నేనైతే చిరు తో ఒక మంచి కామెడీ సినిమా తీస్తాను ” అన్నారు రెడ్డి. ఆయన మాటలు విన్న వారికి చిరంజీవితో అంత మంచి సాన్నిహిత్యం ఉన్న ఆయన ఎలా చిరంజీవి గురించి అంత మాట అన్నారో, ఆయన మాటల వెనుక ఉన్న అర్థం ఏమిటో అవగతం కావడంలేదు. ఒకవేళ చిరు రాజకీయపరంగా ఫెయిల్ అయ్యారు కాబట్టి తన సినిమాల ద్వారా సందేశాలు ఇస్తే జనాలు నమ్మరని, నవ్వుతారని ఆయన నమ్మకమేమో ఆయనకే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -