Thursday, May 16, 2024
- Advertisement -

బిచ్చగాడు రీమేక్ వద్దన్నాడు

- Advertisement -

బిచ్చగాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ కొట్టి చిత్రం. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు విడుదలైన సమయంలో ఆ భారీ సినిమాలను వెనక్కి నెట్టేసి బిచ్చగాడు హిట్ అయ్యింది. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగులో రానా హోరోగా రీమేక్ చేయాలనుకున్నారట.

అయితే తమిళ్ లో ఈ సినిమా చూసిన రానా ఎందుకనో ఈ ప్రాజెక్టుకు అంగీకరించలేదు. దీంతో దీని రీమేక్ నిలిచిపోయింది. ఇంకెవరైనా ఈ రీమేక్ కోసం ముందుకొస్తారని చూసిన బిచ్చగాడు చిత్ర నిర్మాతలు ఎవరూ రాకపోవడంతో తామే డబ్బింగ్ చిత్రంగా విడుదల చేశారు. వారి ఆశించిన దాని కంటే ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించి అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఇదంతా ఎలా ఉన్నా రానా మాత్రం మంచి ఛాన్స్ మిస్సయ్యాడు అంటున్నారు సినీ పండితులు. ఇప్పటి దాకా మంచి హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న రానా ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో అంటున్నారు. అయినా కాలం కలసి రాకపోతే ఇలాగే ఉంటుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -