Sunday, May 5, 2024
- Advertisement -

ఓం కారన్నయ్య చేతిలోనే అంతా ఉంది.

- Advertisement -

నాగార్జున లాంటి బడా హీరో ఓంకార్ ను నమ్ముకుని రాజుగారి గది-2లో కీలక పాత్ర పోషిస్తున్నాడంటే అది మాములు విషయం కాదు. ఎంతో ఫిల్టర్ చేస్తే గాని నాగార్జున ఏ మ్యాటర్ ఒప్పుకోడు. అయితే ఈసినిమా ఫలితంపైనే నాగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓంకార్ కూడా ఎంతో టెన్షన్ లో ఉన్నట్లు టాలీవుడ్
అంతా కోడై కూస్తుంది.

ఈసినిమాలో సమంతా, షీరత్ కపూర్ లు కూడా నటించడంతో సినిమాలో పాత్రలకు డిమాండ్ ఏర్పడింది. మామగారితో నటించిన రెండవ చిత్రం కావడంతో సమంతా సెంటిమెంట్ కోసమైనా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటుంది. అంతేకాదు.. మూవీలో సమ్ థింగ్ స్పెషల్ అనిపించే విశేషాలు చాలా ఉన్నాయని చెబుతుంది. ఓంకార్ కూడా మూవీ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉండటమే కాదు.. ఈ సిరీస్ లో మరో మూవీ కూడా చేసేస్తానంటున్నాడు.

రాజుగారి గది-2 చిత్రం ఒకవేళ విజయాన్ని మూటగట్టుకుంటే మాత్రం… ఓంకార్ ఇకపై పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసే స్థాయికి వెళతాడు. లేదంటే ఉన్న ఈ స్థాయి హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ గెస్ట్ రోల్స్ కు మాత్రం.. తనకున్న పలుకుబడితో బడా హీరోలతో నడిపించేస్తాడు. బట్ ఓంకార్ నమ్మకం చూస్తుంటే మాత్రం.. రాజుగారి గది-2 కచ్చితంగా వర్కవుట్ అయ్యే ప్రాజెక్ట్ లాగానే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -