వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చెయని తప్పుకి చాలా నెలలు జైల్లో ఉన్నారని వైసీపీ పార్టి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్ పాదయాత్రకు అనుమతి వస్తుందా.. లేదా అనేది వేరే విషయం కానీ.. జగన్ చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తారని రోజా తెలిపింది. హైదరబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మీడియాతో రోజా మాట్లాడారు.
జగన్ గారి పాదయాత్ర సక్సెస్ అవుతుందని.. ఎలాంటి అడ్డంకులు ఉండవని ధీమాగా చెప్పారు. పాదయాత్ర విషయమై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామన్నారు. శుక్రవారం ఒక్కరోజు జగన్ కోర్టుకు వెళితే సరిపోతుందని, పాదయాత్ర చేయొద్దని కోర్టు చెప్పదని ఆమె తెలిపారు. వైసీపీకి ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యం. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని రాజశేఖరరెడ్డి అనుకున్నారు. ఆ సంతోషం కోసమే జగన్ పాటుపడుతున్నారు. చేయని తప్పుకి జగన్ ఎన్ని నెలలు జైల్లో ఉన్నారో మీరు చూశారు అని రోజా అన్నారు. ఎవరో ఏదో అంతున్నారని పాదయాత్రను ఆపే ప్రసక్తే ఉండబోదని చెప్పారు. వైఎస్ జగన్ పోరాట యోధుడని రోజా అన్నారు. జగన్ ఖచ్చితంగా పాదయాత్ర చేస్తారని తెలిపారు.
రాజధాని నిర్మాణం పెరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నారని రోజా అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించిన వైనాన్ని రోజా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం వద్ద తల ఊపి ప్యాకేజీ కావాలంటున్నారని అన్నారు. కేంద్రంను ఎందుకు నిలదీయలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు. తన చేతకాని తనాన్ని కప్పిపుచుకునెందుకు జగన్ పై బురుద చల్లడం సరికాదని రోజా అన్నారు.
