పూరిజగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీలో హీరోలకి ఓ మ్యానరిజం క్రియేట్ చేసిన దర్శకుడు. తక్కువ బడ్జెట్‌తో పాటు తక్కువ రోజులలో సినిమాలు తీసి చూపించిన దర్శకుడు పూరిజగన్నాథ్. అలాంటి దర్శకుడు చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. మహేశ్ బాబు,ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరి ఇప్పుడు సినిమాల కోసం హీరోల చూట్టు తిరుగుతున్నాడు. పూరి జగన్నాథ్‌కు చాలకాలంగా సరైన హిట్ లేదు. కొడుకుతో తీసిన సినిమా ఘోరంగా ఫెయిల్ కావడంతో పూరితో సినిమాలు చేయడానికి హీరోలు భయపడుతున్నారు.
తాజాగా పూరి టాలీవుడ్ సన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఆ క్రమంలోనే విజయ్ తో పూరి భేటీ అయ్యారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ సీన్ వేరేగా ఉంది. ప్రస్తుతం వరుస కమిట్ మెంట్ లతో బిజీగా వున్నాడు. తన మామ భాగస్వామ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డియర్ కామ్రేడ్
లో నటిస్తున్న విజయ్ ఆ సినిమా తరువాత మరిన్ని కమిట్ మెంట్ లు ఇచ్చాడట. అవన్నీ ఎప్పుడు పూర్తవ్వాలి? ఎప్పుడు పూరీకి డేట్లివ్వాలి.. పూరి ఆశ నెరవేరే ఛాన్సుందా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ప్లాప్‌లలో ఉన్న పూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తాడా అనేది డౌటే.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు