Wednesday, May 1, 2024
- Advertisement -

ర‌జినీ అభిమానుల‌కు శుభ‌వార్త ..2.ఓ’ టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

- Advertisement -

ర‌జినీ అభిమానుల‌కు శుభ‌వార్త‌. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. రజనీకాంత్ అభిమానులు, రోబో సినిమా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 2.0 (రోబో-2) టీజ‌ర్ విడుదలపై అధికారిక ప్రకటన ఎట్టకేలకు వచ్చేసింది. భారీ చిత్రాల దర్శకుడిగా .. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా శంకర్ కి మంచి పేరుంది. బలమైన కథా కథనాలకు భారీతనాన్ని జోడించి అందించడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా రూపొందుతోన్న ‘2.ఓ’ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను శంకర్ ఎనౌన్స్ చేశాడు. ‘వినాయకచవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పాడు. రజనీ అభిమానులందరికీ ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ టీజర్ తో శంకర్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.

తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న 2.0 మూవీలో రజనీకాంత్తో పాటు అక్షయ్ కుమార్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండటంతో బాహుబలి 2 కి మించిన స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయం అని భావిస్తున్నారు మేకర్. ఈ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ రోబో 2 షేక్ చేయడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -