తన మావయ్య అక్కినేని నాగార్జున చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తనని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది అని చెబుతున్నాడు హీరో సుమంత్. నిన్న ఊపిరి ఆడియో వేడుకలో పాల్గొన్న సుమంత్ ఈ విషయం బయట పెట్టాడు. ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు హీరో సుమంత్ ఒక అమ్మాయి ని చూసి నవ్వాడు అట.
ఆ అమ్మాయి సుమంత్ దగ్గరకి నేరుగా ఒచ్చి ఎందుకు నవ్వారు అని అడగగా ఊపిరి టీజర్ లో ‘ అందాన్ని ‘ ఆస్వాదించాలి అనే డైలాగ్ చెప్పాడట. అలా చెప్పడం వలన అమ్మాయి దగ్గర నుంచి తాను తప్పించుకున్నాను అంటున్నాడు సుమంత్.
అబ్బాయిలు అందరూ ఇదే డైలాగ్ చెప్పి అమ్మాయిల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అంటున్నాడు సుమంత్. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఈ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక లో ఎమోషనల్ అయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్టేజీ మీదనే ఏడిచారు. తన పని అయిపొయింది అనుకున్న తరుణం లో, ఈ సినిమా స్క్రిప్ట్ అటక మీద కి ఎక్కేసింది అనుకున్న తరుణం లో హీరో కార్తి తనని కాపాడాడు అని చెప్పుకొచ్చారు ఆయన.
