Saturday, May 11, 2024
- Advertisement -

హీరోగా అవతారం ఎత్తనున్న స్టార్ ద‌ర్శ‌కుడు

- Advertisement -

వివి వినాయ‌క్ ఒక‌ప్పుడు స్టార్ ద‌ర్శ‌కుడు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు క‌దా. ఈ మ‌ధ్య‌న వినాయ‌క్ చెప్ప‌కోద‌గ్గ విజ‌యాలేవి అందుకోలేక పోయారు. ఆయన గత చిత్రం ‘ఇంటలిజెంట్’ సైతం విఫలమైంది. మ‌రో వైపు ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఈమధ్య పలువురి హీరోల కోసం ఆయన కథలు రాస్తున్నారని వార్తలు వెలువడినా వాటిలో వాస్తవం లేదని తేలింది. ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా అవతారం ఎత్తనున్నారు. ఈ వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

నిజంగా ఇది ఆయ‌న అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ వార్తె. అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’లో ఓ గుర్తుండిపోయే పాత్రను ధరించిన వినాయక్, ఇప్పుడు సోలో హీరోగా పరిచయం కాబోతుండగా, దీన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

శరభ’ ఫేమ్, గతంలో శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మ‌రి ఇప్పుడు వి.వి.వినాయ‌క్‌ని ప్రేక్ష‌కుల ఆద‌రిస్తారో లేదో చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -