Friday, May 10, 2024
- Advertisement -

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో..

- Advertisement -

పాత్రకి తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చు కునే హీరోలలో రానా దగ్గుబాటి పేరు రు ముందు వస్తుంది. ప్రతి సినిమాలోనూ సరికొత్త అవతారంలో రానా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి పాత్ర కోసం బాగా బరువు పెరిగిన రానా ‘ఘాజి’ సినిమా కోసం మళ్లీ బరువు తగ్గడం, ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా చంద్ర బాబు లాగానే కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా తన తదుపరి సినిమా కోసం సరికొత్త అవతారంలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు ఈ యువ హీరో.

తాజాగా రానా ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గుబురు గడ్డంతో తో పెద్ద జుట్టు తో ఉన్న సరికొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. లూజ్ బట్టలతో రఫ్ లుక్ తో కనిపిస్తున్న రానా ఈ అవతారంలో తన తదుపరి సినిమా అయినా ‘హాథి మేరే సాథీ’ లో కనిపించబోతున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిందీలో మాత్రమే కాక తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. కల్కి మరియు జోయ హుస్సేన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -