భారత క్రికెట్ కోచ్ పదవి కోసం బిసిసిఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రపంచకప్ వైఫల్యం తర్వాత టీమిండియాకు కొత్త కోచ్ ను నియమించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కు కోచ్ పదవి అంటే మామూలు విషయం కాదు. అందుకే చాలామంది ఈ కోచ్ పదవిని ఆశిస్తుంటారు. భారీగా వేతనం అంతే రీతిలో ఇతర సహాయాలు ఉంటాయి.
ప్రపంచకప్ తోనె రవిశాస్త్రి కోచ్ పదవి ముగిసినా విండీస్ టూర్ ఉండటంతో ఆయన పదవీకాలాన్ని కొంతకాలం పొడిగించారు. బిసిసిఐ కోచ్ పదవికోసం దాదాపుగా 200ం దరఖాస్తులు వచ్చాయని సమాచారం. టీమిండియా హెడ్ కోచ్ పదవికి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ, భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్‌కోచ్ పదవికి టామ్ మూడీతోపాటు న్యూజిలాండ్ మాజీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. అలాగే భారత మాజీ క్రికెటర్లు రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు కూడా ఇటీవలే ఈ పదవికి దరఖాస్తు చేశారు. ఇక ఈ పదవి కోసం పలువురు విదేశీ క్రికెటర్లు ఇప్పటికే బీసీసీఐకి అప్లికేషన్లను పంపారని, వాటన్నింటినీ బీసీసీఐ పరిశీలిస్తున్నదని తెలిసింది.
