Friday, April 19, 2024
- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోలో వ్యక్తి అనుమానాస్పద మృతి

- Advertisement -

హీరో నాగ‌ర్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది.హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.నారాయణరెడ్డి మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నారాయణరెడ్డి వయసు 53 ఏళ్లు.

అయితే బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది.నారాయణరెడ్డిని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన బంధువులు వ్యక్తపరుస్తున్నారు. దీంతో నార‌య‌ణ‌రెడ్డి బంధువులు ఉస్మానియా ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, మరింత సమాచారం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లనున్నారు.హీరో నాగ‌ర్జునని కూడా పిల‌వ‌నున్నార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -